Share News

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ప్రచారం

ABN , Publish Date - May 22 , 2026 | 11:10 PM

ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ప్రచారం
మల్దకల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల ప్లెక్సీ

మల్దకల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి, మండలస్థాయిలో ర్యాంకులు పొందారు. దీంతో వీరి ఫొటోలు, ర్యాంకులు, మార్కులతో కూడిన ఫ్లెక్సీలను మల్దకల్‌లో ఏర్పాటు చేశారు. ఇవి ప్రైవేట్‌ పాఠశాలల ప్రచారాన్ని తలపిస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - May 22 , 2026 | 11:10 PM