Share News

సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:28 PM

సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, ఎప్పటికప్పుడు సైబర్‌ నేరస్తులు కొత్త పద్ధతులను అవలంభించి జనాలను మోసం చేస్తున్నారని ఎస్పీ జానకి పేర్కొన్నారు.

సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి : ఎస్పీ
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, ఎప్పటికప్పుడు సైబర్‌ నేరస్తులు కొత్త పద్ధతులను అవలంభించి జనాలను మోసం చేస్తున్నారని ఎస్పీ జానకి పేర్కొన్నారు. మంగళవారం అక్టోబరు 7న నిర్వహించనున్న సైబర్‌ జాగృక్ష దివస్‌ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. అక్టోబరు నెలంతా జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్‌, ఆర్థిక లావాదేవీలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకింగ్‌ విషయాలను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త పడేలా వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌ మోసాలకు గురైనపుడు వెంటనే పోలీసులను సంప్రదించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలంతా కళాశాలలు, పాఠశాలలు, కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషినల్‌ ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, సీసీఎఎస్‌ సీఐ నాగార్జునగౌడ్‌, సైబర్‌క్రైమ్‌ సీఐ శ్రవణ్‌కుమార్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐ వసంత పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:28 PM