Share News

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:04 PM

రైతులు, ప్రజలు, కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం ఎల్‌) మాస్‌లైన్‌ పార్టీ ఆధ్వర్యంలో సో మవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ధన్వాడలో తహసీల్దార్‌ సింధూజకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

- తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆధ్వర్యంలో ధర్నా

ధన్వాడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రైతులు, ప్రజలు, కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం ఎల్‌) మాస్‌లైన్‌ పార్టీ ఆధ్వర్యంలో సో మవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సింధూజకు సమర్పించారు. ఈ సందర్భంగా పా ర్టీ డివిజన్‌ కార్యదర్శి సలీమ్‌, డివిజన్‌ నాయ కుడు జి.కృష్ణయ్య, అఖిల భారత ప్రగతిశీల వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు వై.రాజు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఈ యేడు పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వం రైతులపై ఉన్న బ్యాంకు రుణాలు, అప్పులు రద్దు చేసి, ఎకరాకు రూ. 10వేలు చొప్పున పరిహారం అందించడంతో పాటు ఫసల్‌ భీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే ఇచ్చిన హా మీలను నెరవేర్చాలని, ఎస్‌ఐఆర్‌ విధానాన్ని ర ద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల అధికారిని తొల గించాలని డిమాండ్‌ చేశారు. ఏఐపీకేఎంఎస్‌ జిల్లా నాయకుడు వై.రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పీకే.రాములు, రైతు ఐక్య సంఘం నాయకుడు తెలుగు సాయన్న, పీవో డబ్ల్యూ మహిళా సంఘం నాయకురాళ్లు రాధ, లక్ష్మి, రాజు తదితరులున్నారు.

అదేవిధంగా, దామరగిద్ద తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నిర్వహించిన ధర్నాలో సీపీఐఎం ఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ జిల్లా నాయకుడు పి.రా మకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని కల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, దా మరగిద్దను కరువు మండలంగా ప్రకటించాలని, అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ తిరుపత య్యకు అందించారు. నాయకులు తాయప్ప, మ ధు, ప్రకాష్‌, గోవిందు, సంతోష్‌, భీమేష్‌, నర్సిం హ్మ, రాజు, అనిల్‌, అంజి, రవీందర్‌ ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:05 PM