మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:24 PM
జనరల్ ఆసుప త్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యసే వలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం), ఫిబ్ర వరి 19 (ఆంధ్రజ్యోతి): జనరల్ ఆసుప త్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యసే వలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జనరల్ ఆ సుపత్రిలో కలెక్టర్‌తో పాటు అదనపు క లెక్టర్ శివేంద్రప్రతాప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు క్యాజువాలి టీ, ఐసీయూ, ఆర్థోవార్డు, స్పెషల్ రూంలు, డైట్ వంటగదిని పరిశీలించారు. అక్కడి రో గులతో వారికి అందుతున్న సేవలను గు రించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి అందిస్తున్న భోజనాన్ని కూడా పరిశీ లించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి కేసును క్షుణ్ణం గా పరీక్షలు చేసి అవసరమైన వైద్యసేవ లు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో హైద రాబాద్‌కు రెఫర్ చేయవద్దన్నారు. ఐసీ యూలో పరిశుభ్రతను పాటించాలని, అవ సరమైన అత్యవసర మందులు కూడా కొ నుగోలు చేసి రోగులకు ఇవ్వాలన్నారు. మందులు బయటకు రాసి ఇవ్వొద్దన్నారు. ఆర్థోకేసులు పెంచాలని, ప్ర తీ కేసును ఆరోగ్యశ్రీ కింద స ర్జరీ చేయాలన్నారు. వాటి నుంచి వచ్చిన ఆదాయాన్ని హెచ్‌డీఎస్‌లో జమ చేయా లన్నారు. అదేవిధంగా రోగు లకు అందించే భోజనంలో ప్రతీరోజు మెనూ పాటించా లని, నాణ్యమైన భోజనం అందించాలని ఆ దేశించారు. లేకుంటే చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఽఅధికారులను ఆదేశించారు. కలె క్టర్‌తో పాటు ఆసుపత్రి అధికారులు, ఆ యా విభాగాల హెచ్‌వోడీలు డాక్టర్ మాధ వి, డాక్టర్ సునీల్, ఆర్‌ఎంవోలు జరీనా తదితరులు ఉన్నారు.