Share News

సీఎం వ్యాఖ్యలపై నిరసనలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:44 PM

హిందువుల మనోభావాలను కించపరిచే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని బీజేవైఎం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి అన్నారు.

సీఎం వ్యాఖ్యలపై నిరసనలు
గద్వాల గాంధీచౌక్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు

గద్వాలటౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): హిందువుల మనోభావాలను కించపరిచే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని బీజేవైఎం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి అన్నారు. రాముడు ఉత్తరాది అని, శివుడు దక్షిణాది అని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక గాంధీచౌక్‌ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అ నంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దేవదాసు, రమేష్‌, తిరుపతిరెడ్డి, శ్రీను, పాండు, గాంజాసాయి, నర్సింహయ్యశెట్టి, సతీశ్‌, నాగమల్లయ్య, రెడ్డప్ప ఓంకార్‌ ఉన్నారు.

  • అయిజలోని కొత్త బస్టాండ్‌ ముందు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం హిందూ దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కార్యక్రమం తలపెట్టినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షు డు నర్సింహ, బీజేవైఎం మండల అధ్యక్షుడు అంజి తెలిపారు. తన మాటలను వెనక్కి తీసు కుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే హిందువులు బుద్ధి చెప్పే రోజులను ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Sep 29 , 2026 | 11:44 PM