ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళన
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:17 PM
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బా లింత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువు లు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన ఘట న గురువారం చోటుచేసుకుంది.
- వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని బంధువుల ఆరోపణ
నారాయణపేట క్రైం, సెప్టెంబరు 24 (ఆం ధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బా లింత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువు లు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన ఘట న గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్ గ్రామానికి చెందిన శ్వేత(20)కు రెండు సం వత్సరాల క్రితం కర్ణాటక సామనూరుకు చెం దిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం గర్భం దాల్చిన శ్వేత యాద్గీర్‌రోడ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలవా రిగా వైద్య చికిత్సలు తీసుకుంది. సెప్టెంబరు 22 నాటికి 9నెలలు పూర్తికావడంతో ప్రసవం కోసం అప్పక్‌పల్లి వద్ద గల జనరల్ ఆసుపత్రి కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు పరీక్షించి మరో ప్రైవేటు ఆ సుపత్రికి పంపించారు. యాద్గీర్‌రోడ్ మార్గం లో గల ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షల అనం తరం మెరుగైన ప్రసవం కోసం మరో ప్రైవే టు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆమెను పరీ క్షించి ఆపరేషన్ చేయగా ఆడబిడ్డ జన్మించిం ది. ఈ సమయంలో తీవ్ర రక్తస్రావం జరగ్గా మెరుగైన వై ద్యం కోసం మ హబూబ్ నగర్ కు రెఫర్ చేసి న్నట్లు తెలు స్తోంది. ఈ సమయంలోనే మార్గమధ్యంలో బాలింత మృతి చెందిందని బంధువులు ఆరో పించారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. వైద్య చికిత్సలు అందించడంలో తమ తప్పు ఏమిలేదని, తమ వద్దకు రావడమే అతిక్లిష్ట పరిస్థితుల్లో పేషెం ట్ వచ్చారని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సమాధానం ఇచ్చారు.