రోడ్డుపై నాట్లువేసి నిరసన
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:58 PM
తమ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరైనా పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఆదివారం మండల పరిధిలోని కంటోనిపల్లి గ్రామ యువకులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.
వెల్దండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరైనా పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఆదివారం మండల పరిధిలోని కంటోనిపల్లి గ్రామ యువకులు రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. వెల్దండ నుంచి కంటోనిపల్లి గ్రామానికి రోడ్డు మంజూరైనా ఏళ్లు గడుస్తున్నా పనులు కావడంలేదని, నిత్యం బురద గుంటలుగా మారిన రోడ్డుపై ప్రయాణాలు చేయలేకపోతున్నామని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతూ రోడ్డుపై వరినాట్లు వేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఉపసర్పంచ్ శివప్రసాద్, తేజ, రాజు, ప్రవీణ్, రాము, శివ, వెంకటేష్ తదితరులు ఉన్నారు.