Share News

అమెరికా తీరుకు నిరసనగా ధర్నా

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:19 PM

వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మథురో, అయన భార్యను అమెరికా తక్షణమే విడుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌, సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

అమెరికా తీరుకు నిరసనగా ధర్నా
తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న మాస్‌లైన్‌ నాయకులు

పాలమూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మథురో, అయన భార్యను అమెరికా తక్షణమే విడుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌, సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మాస్‌లైన్‌, సీపీఎం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో అమెరికా తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. వెనిజులా దేశంపై అర్థరాత్రి అమెరికా యుద్ధం చేయడాన్ని మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకుడు కృష్ణ, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాంచందర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు ఖండించారు. అమెరికా వెనుకబడ్డ దేశాలపై అధిక ఖనిజాలు ఉన్న చమురు సంపద ఉన్న వెనిజులాను అక్రమించడం కోసం సంపదపై ఆదిపత్యం సాధించేందుకు యుద్ధాలకు పాల్పడుతోందన్నారు. మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు సూర్యం, వెంకటేష్‌, అరుణ్‌కుమార్‌, సాంబశివుడు, గణేష్‌, హనుమంతు, బాలు, నారాయణ, బుజ్జి, వెంకట్‌రెడ్డి, రాకేష్‌, సాగర్‌, సీపీఎం నాయకులు కిల్లె గోపాల్‌, దీప్లానాయక్‌, ఖమర్‌అలీ, ఆదివిష్ణువర్ధన్‌, మోహన్‌, చంద్రం పాల్గొన్నారు.

హన్వాడ : మండల కేంద్రమైన హన్వాడలో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. సీపీఎం నాయకులు లక్ష్మయ్య, రాములు, రేఖమయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:19 PM