బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:39 PM
బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జోగుళాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కాపాత్రుడు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కాపాత్రుడు
గద్వాల క్రైం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని జోగుళాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కాపాత్రుడు అన్నారు. ఈ నెల 14న నిర్వహించనున్న బాలల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన బాలల కోసం బాల స్నేహపూర్వక న్యాయసేవల పథకం-2024 అమ లులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలసదన్‌తో పాటు గోనుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, శాంతివృద్ధాశ్రమంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కాపాత్రుడు హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని, బాలబాలికలకు సురక్షిత బాల్యం, విద్య, ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవితం పొందే హక్కు ఉందన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలకార్మికత్వం, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. బాలలు తమ కు ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అవసరమైనప్పు డు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సునంద, జిల్లా బాలల పరిరక్షణ అధికారి నరసింహ, కేజీబీవీ ప్రిన్సిపల్ గోపీలత, వృద్ధాశ్రమ ఇన్‌చార్జి రంగన్న, బాలసద న్ ఇన్‌చార్జి స్నేహ, పారాలీగల్ వలంటీర్ దైవప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఉన్నారు.
బాలసదనంలో బాలల దినోత్సవం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలసదనంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నిష్కాపాత్రుడు హాజరై చిన్నారులతో కలిసి కేక్ కట్‌చేసి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బాలల ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీవోఐసీ ఇన్‌చార్జి సురేశ్, చైల్డ్‌కేర్ ఇనిస్టిట్యూట్ మాట్రిన్ స్నేహ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ శివలీల, సిబ్బంది పద్మ, నవీన్, లక్ష్మి తదితరులు ఉన్నారు.