మహిషాసుర మర్దినీ పాహిమాం
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:55 PM
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం పట్టణలోని ఆలయాల్లో అమ్మవారు విభిన్నరూపాల్లో కొలువై భక్తులపూజలు అందుకున్నారు.
గద్వాలటౌన్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం పట్టణలోని ఆలయాల్లో అమ్మవారు విభిన్నరూపాల్లో కొలువై భక్తులపూజలు అందుకున్నారు. నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు కావడంతో అమ్మవారిని మహిషాసురమర్దిని కాళికాదేవి రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంత రం మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు.
శ్రీదుర్గాదేవి అలంకారంలో జములమ్మ
గద్వాల,(ఆంధ్రజ్యోతి):నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జములమ్మ దేవత ఆదివారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం విశేషఫల పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ సేవ చేసిన అనంతరం అమ్మ వారికి ఆలయ ఈఓ పురేందర్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు రోజు కావడంతో అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎనిమిది రోజులుగా అంతరంగ వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి.