Share News

ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:45 PM

బీచుపల్లి ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ప ర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు
బీచుపల్లి వద్ద కృష్ణానది పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

  • బీచుపల్లిలో పుష్కర ఘాట్లు, ఆలయ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్‌

  • ఆంజనేయస్వామికి పూజలు

  • పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు

ఎర్రవల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బీచుపల్లి ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ప ర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. ఇప్పటికే కృష్ణానదిలోని నిజాంకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్ర తిపాదనలను పర్యాటక శాఖకు పంపామని తెలి పారు. పుష్కరఘాట్లు, ఆలయ పరిసరాలను శు భ్రంగా ఉంచాలని, భక్తులకు వసతులు కల్పించా లని ఆలయ ఈవో పురేందర్‌కు సూచించారు. బుధవారం ఆయన ఇక్కడి పుష్కరఘాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో చెత్తాచెదా రం, పందులు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భద్రత కోసం అవసరమైన సూ చిక, హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. మినీపా ర్క్‌, ఫౌంటెయిన్‌ను పరిశుభ్రంగా ఆకర్షణీయంగా నిర్వహించాలని, ఆలయ పరిసరాల్లోని హోట ళ్లను నిబంధనల ప్రకారం అవసరమైన ప్రమా ణాలతో నిర్వహించాలన్నారు. నదితీరంలో భక్తు ల భద్రత కోసం సేవలందిస్తున్న గజఈతగాళ్లకు లైఫ్‌జాకెట్లు, టార్చిలైట్లు, రక్షణ తాళ్లు, రెస్క్యూ బోట్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అ నంతరం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చ కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయం లో ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రాలతో స త్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ నరేశ్‌, ఈవో పురేందర్‌, ఆర్‌ఐ శంషీర్‌, కార్యదర్శి అరుణ ఉన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 11:45 PM