సిలిండర్ గ్యాస్ లీకై ఆస్తి నష్టం
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:33 PM
సిలిండర్ గ్యాస్ లీక్ కావడం తో సుమారుగా రూ. 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణా నికి వెళ్లే పరిధిలోని మెయిన్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోటు చేసుకుంది.
ఆత్మకూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్ర జ్యోతి): సిలిండర్ గ్యాస్ లీక్ కావడం తో సుమారుగా రూ. 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణా నికి వెళ్లే పరిధిలోని మెయిన్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు శోభారాణి, చంద్రశేఖర్‌లు తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో వంట చేస్తుండగా సి లిండర్ లీక్ అయి మంటలు చెలరేగ డంతో గృహిణి శోభారాణి బోరున విల పిస్తూ పిల్లలు ఇటీవల ప్రమాదానికి గురైన తన భర్త చంద్రశేఖర్‌ను బయటకు రప్పించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురై చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది శ్రీనివాస్, రాముడు, నాగ రాజు, రామచంద్రారెడ్డిలు శ్రమించి మంటలు ఆర్పే సమయానికి పూర్తిగా నష్టం వాటిల్లిందని తెలిపారు. గద్వాల జిల్లాలోని బిజ్వార్ గ్రామం నుంచి గత పది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన డీకే రవి ఇంట్లో ఉంటున్నా మని, కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపింది. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో గృహిణి శోభారాణి బోరున విలపిస్తూ ఇంట్లో 50వేల నగదు, బంగారం, బీరువా ఫ్రిడ్జ్, విలువైన పట్టు చీరలు పూర్తిగా కాలిపోయాయని విలపించింది.