Share News

సాంకేతికతతో లాభసాటి వ్యవసాయం

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:49 PM

మారుతు న్న వాతావరణ పరిస్థితుల కను గుణంగా కొంగొత్త ఆ లోచన లు, ఆధునిక సాంకే తికతను మేళవించి వ్యవసాయం చేసి నప్పుడే రైతులు లాభాలు ఆర్జించగలరని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు.

సాంకేతికతతో లాభసాటి వ్యవసాయం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కిసాన్‌ మేళాలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మారుతు న్న వాతావరణ పరిస్థితుల కను గుణంగా కొంగొత్త ఆ లోచన లు, ఆధునిక సాంకే తికతను మేళవించి వ్యవసాయం చేసి నప్పుడే రైతులు లాభాలు ఆర్జించగలరని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. వ్యవసాయంలో చేస్తున్న ఆధునిక పద్ధతులు, కొత్త వంగడాలు, యాంత్రిక పరికరాలను రైతులు అం దిపుచ్చుకోవాలని కోరారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వ ర్యంలో బుధవారం వనపర్తి జిల్లా కేం ద్రంలోని పద్మావతి శ్రీనివాస గార్డెన్‌లో నిర్వహించిన కిసాన్‌ మేళా -2026కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. కిసాన్‌ మేళాలో వివిధ కంపె నీలు మేలురకం విత్తనాలు, సోలార్‌ ఫెన్సింగ్‌, రసాయన మందులు, కోళ్లు, పొట్టేళ్లు, గిరిజాతి ఆవులు, సమీకృత ఉ ద్యానవనం, పట్టు పరిశ్రమ, పామాయి ల్‌ సాగు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, ఆధు నిక వ్యవసాయ యంత్రాలు, పనిము ట్లను ప్రదర్శనకు ఉంచి రైతులకు అవ గాహన కల్పించాయి. కలెక్టర్‌ అన్ని స్టా ళ్లను సందర్శించి ఉత్పత్తుల వివరాలు, నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కిసాన్‌ మేళా ద్వారా దే శంలోని వివిధ పరిశ్రమలు, అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఎరువులు, యాంత్రిక పరికరాలను ఒకేచోట రైతు లకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి వినియోగం ద్వారా లాభసాటి వ్యవసా యంపై అవగాహన కల్పిస్తున్నారని అ న్నారు. ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమానికి రైతులు హా జరై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Sep 23 , 2026 | 11:49 PM