గజ వాహనంపై అభయుడి ఊరేగింపు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:22 PM
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో వెలసిన అభయాంజనే యుడు ఆదివారం గజవాహనంపై ఊరేగా రు.
ఊర్కొండ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో వెలసిన అభయాంజనే యుడు ఆదివారం గజవాహనంపై ఊరేగా రు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భం గా భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరా లు హనుమాన్ నామస్మరణతో మారుమో గాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వా మి వారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు చేశా రు. అభయాంజనేయస్వామి వారి బ్రహ్మో త్సవాలను పురస్కరించుకొని రెండో రోజు స్వామి వారికి ఉదయం అర్చకులు పంచ సూక్తములతో పూజలు, సహస్రనామార్చన, గణపతి నవగ్రహ అష్టదిక్పాలక లక్ష్మీ అవ నం (హోమం) నిర్వహించారు. రాత్రి గజ వాహన సేవ, భక్తుల భజనలు ప్రదోశపూ జలు జరిగాయి. ఉత్సవాల్లో భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యని ర్వహ ణాధికారి స త్యచంద్రారెడ్డి ముం దస్తు జాగ్రత్తలు తీ సుకున్నారు. ఎస్‌ఐ కృష్ణదేవ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బం దోబస్తు ఏర్పాటు చే శారు.
రూ. లక్ష చెక్కును అందజేత
ఆలయ మాజీ చైర్మన్ బెక్కరి రాజశే ఖర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్‌పర్సన్, ఇప్పప హాడ్ సర్పంచ్ బెక్కరి సునీతారెడ్డి బ్రహ్మో త్సవాలను పురస్కరించుకొని ఆదివారం అభయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణపతి నవగ్రహ అష్టదిక్పాలక లక్ష్మీ అవనంలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా రూ.లక్ష చెక్కును ఆలయ అభివృద్ధికి జూనియర్ అసిస్టెంట్ మారుతిరావుకు అం దజేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ రషీద్, నాయకులు సత్యనారాయణరెడ్డి ఆలయ సిబ్బంది మారుతిరావు, వరలక్ష్మి, అర్చకులు దత్తాత్రేయశర్మ, మహేష్‌శర్మ, ప్రవీణ్‌శర్మ, శ్రీనివాస్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.