Share News

లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:34 PM

ఏపీ నుంచి హైదరాబాద్‌ కు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఆదివారం తెల్లవారుజామున ప్ర మాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైం ది.

 లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు
ప్రమాదానికి గురైన ట్రావెల్‌ బస్సు

- తెల్లవారుజామున జాతీయ రహదారిపై ప్రమాదం

- పలువురికి గాయాలు

ఎర్రవల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి హైదరాబాద్‌ కు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఆదివారం తెల్లవారుజామున ప్ర మాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైం ది. ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్‌ క థనం ప్రకారం... ఏపీలోని పీలేరు నుంచి శనివారం రాత్రి 8గంటల కు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇటిక్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మునుగాల గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ముందుగా వెళ్తున్న లారీని డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగంతో ఢీకొట్టాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు అంజలికి కుడి కణతపై, శిరీషకు ఎడమకాలి ఎముక విరిగింది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా, ప్రథమ చికిత్సను హైవే అంబులెన్స్‌ సిబ్బంది అందించి వేరే బస్సులో గమ్యాలు చేరేందుకు పంపినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ప్రయాణికులంతా నిద్రావస్థ సమయంలో ప్రమాదం జరగడంతో ఘోర ప్రమాదం నుంచి బయటపడినట్లు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

- తప్పిన పెను ప్రమాదం

వనపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మండ ల పరిధిలోని కడుకుంట్ల గ్రామం లో ఆదివారం ఆర్టీసీ బస్సు అదు పు తప్పి గుంతలోకి దూసుకుపో వడంతో పెను ప్రమాదం తప్పిం ది. ప్రతీ రోజూ ఐదారు సార్లు ఆ ర్టీసీ బస్సు వనపర్తి నుంచి పెద్ద గూడెం మీదుగా కడుకుంట్ల వెళ్లి తిరిగి వనపర్తి వస్తూ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కు వగా ఉంటుంది. రోజు మాదిరిగా వనపర్తి నుంచి కడుకుంట్లకు వెళ్తుండగా పెద్దగూడెం శివారు రాగానే మూలమలుపు ఒక కల్వర్టు దగ్గర ముందు వస్తున్న కారును తప్పించబోయి గుంతలోకి దూసుకుపోయింది. ఆర్టీసీ బస్సు ముందు టైర్లు గుంతలోకి పోగానే అప్రమత్తమైన డ్రైవర్‌ బ్రేకులు వేసి ఆ పేశాడు. ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఊపిరి పీల్చుకు న్నారు. ఆర్టీసీ బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ప లువురు వాపోయారు.

Updated Date - Apr 26 , 2026 | 11:34 PM