Share News

ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:00 PM

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్ర భుత్వ నిబంధనలు పాటిస్తూ వాటికనుగుణంగా పని చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశిం చారు.

 ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా, అక్టోబరు 29 (ఆం ధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్ర భుత్వ నిబంధనలు పాటిస్తూ వాటికనుగుణంగా పని చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మం దిరంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధ్యక్షతన క్లినిక ల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహిం చారు. వనపర్తి జిల్లాలో కొత్త ప్రైవేట్‌ ఆసుపత్రు ల ఏర్పాటుకు అనుమతులు, రెన్యువల్‌, డయా గ్నోస్టిక్‌ సెంటర్ల రెన్యువల్‌ అనుమతులకు సం బంధించి మొత్తం పది ప్రతిపాదనలను కమిటీ పరిశీలనకు సమర్పించారు. ఈ సందర్భంగా క మిటీ సభ్యులు ఆయా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత నిబంధనలు ప్రమాణాల ను పాటించి దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేశారు. అనతంరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వివిధ వైద్య సేవలకు సంబంధించిన ధరల పట్టికలను రోగు లకు స్పష్టంగా కన్పించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా ఆసుపత్రులు నిర్వహించినా ని బంధనల ఉల్లంఘనలకు పాల్ప డినా సంబంధిత ఆసుపత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవ లందించేలా సంబంధిత అధికా రులు ఆసుపత్రుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూ చించారు. స్థానిక సంస్థల అదన పు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, డీఎం హెచ్‌వో భాస్కర్‌నాయక్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కొత్తకోట,(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందు బాటులోనే మెరుగైన వైద్య సేవలు అందించ డంలో భాగంగా చేపట్టిన సామాజిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించా రు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం స మీపంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరిం గ్‌ అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆస్పత్రి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిస రిగా పాటించాలని, ఎలాంటి లోపాలు లేకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీ లైనంత త్వరగా పనులు పూర్తి చేయించి ప్రజ లకు అందుబాటులోకి తీసుకురావాలని కోరా రు. జిల్లా వైద్యాధికారి భాస్కర్‌ యాదవ్‌ తది తరులు ఉన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:00 PM