ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:34 PM
నారాయణపేట జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అ దనపు కలెక్టర్ శ్రీను సూచించారు.
- అదనపు కలెక్టర్ శ్రీను
నారాయణపేట రూరల్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అ దనపు కలెక్టర్ శ్రీను సూచించారు. నీటి లభ్యతకనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటూ సమగ్ర వ్యవసాయ విధానాలు, సహజ వ ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందవచ్చన్నారు. మండలంలోని సింగారం రైతువేదికలో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని, రైతులకు పలు సూచనలు చేశారు. వరి కి బదులుగా కంది, పెసర, మినుములు, శనగలు, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. సమగ్ర వ్యవసాయంతో అదనపు ఆదాయం పొందుతున్న రైతు ప్రతాప్‌రెడ్డిని అభినందించారు. డీఏవో సక్రియానాయక్, సర్పంచ్ నాగిరెడ్డి, రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.