భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:56 PM
ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టి నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాలను పెంపొం దించేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని డీఆర్ డీవో వెంకట్రాములు సూచించారు.
- చంద్రవంచ గ్రామసభలో డీఆర్‌డీవో వెంకట్రాములు
కోస్గి రూరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టి నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాలను పెంపొం దించేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని డీఆర్ డీవో వెంకట్రాములు సూచించారు. బుధవారం మండల పరిధిలోని చంద్రవంచ గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై రైతువేదికలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీవో ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. మండల అధికారులు వనరుల పటం, సామాజిక పటం రూపొందించి వివరాలు తెలి యజేశారు. వర్షపాతం ప్రతీసారి ఒకే విధంగా ఉండదని, కొన్ని సందర్భాల్లో తక్కువ, మరికొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. వర్షం పడ్డ ప్పుడే ప్రతీ నీటి చుక్కను నిల్వ చేసే విధానా లను అమలుపరచుకోవాలన్నారు. కరువు నివా రణ, నీటి సంరక్షణను గ్రామాభివృద్ధి ప్రణాళి కలో ప్రధాన లక్ష్యాలుగా చేర్చాలన్నారు. అలాగే ఫాంపండ్‌లు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు, ఇతర నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించారు. కార్యక్రమా నికి సర్పంచ్ విద్యావతి అధ్యక్షత వహించారు. ఎంపీడీవో శ్రీధర్, ఏపీవో జయప్రకాష్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.