Share News

ప్రధాని మోదీని గద్దె దించాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:11 PM

వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఏకమై ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీని గద్దె దించాలి
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

- సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి

- జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఏకమై ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో ధరలకు హద్దు లేకుండా పోయిందని ఆరోపించారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనే, పప్పులు ఇలా నిత్యావసర సరుకుల ధరలను పెంచి, దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ధరలు తగ్గిస్తారా... లేదా గద్దెదిగుతారా అం టూ నిలదీశారు. జిల్లా కార్యదర్శి అంజనేయులు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షు డు ట్రంపునకు తలొగ్గి దేశ సంపదను, ప్రతిష్టను తాకట్టు పెట్టారని ఆరోపిం చారు. ధరలను తగ్గించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆం దోళనలో నాయకులు ఆశన్న, నాగార్జున, రవి, ప్రతాప్‌, ఈశ్వర్‌, వెంకటేశ్‌, భరత్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:11 PM