క్రీడా సమరానికి సన్నద్ధం
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:53 PM
రాష్ట్రస్థాయి క్రీడా సమరానికి పాలమూరు నగరం వేదిక కానున్నది.
- నేటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ అండర్-17 టోర్నీ
- 10 జిల్లాల నుంచి తరలిరానున్న 340 మంది క్రీడాకారులు
- పోటీల నిర్వహణకు పూర్తయిన ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి క్రీడా సమరానికి పాలమూరు నగరం వేదిక కానున్నది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీ ప్రారంభం కానున్నది. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పోటీలకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, టోర్నీ ఆర్గనైజర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
5 గంటలకు ప్రారంభం...
పాలమూరు నగరంలో నిర్వహించనున్న ఎస్‌జీఎ్‌ఫఐ 70వ అండర్-17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌కు రాష్ట్రంలోని ఉ మ్మడి 10 జిల్లాల నుంచి 340 మంది క్రీడాకారులు, 60 మంది అఫీషియల్స్, కోచ్‌లు, మేనేజర్లు హాజరుకానున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, డీఈవో విజయకుమారి, మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ చైర్మన్ బెక్కరి రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లా అధికారులు, క్రీడా సంఘాల అధికారులు పాల్గొననున్నారు. పోటీలను లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్‌లో బాలికలు, హీరామోడల్ స్కూల్ మైదానాల్లో బాలుర పోటీలకు కోర్టులను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్‌లో బాల, బాలికలకు బస, భోజనం, ఇతర వసతులు ఏర్పాట్లు చేశారు.