సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం చేయాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:08 PM
కోస్గి పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీహెచ్.ప్రియాంక అధికారులను ఆదేశించారు.
- కోస్గిలో రూ.5 కోట్లతో నిర్మాణం
- పరిశీలించిన కలెక్టర్
కోస్గి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కోస్గి పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీహెచ్.ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె సైన్స్ మ్యూజియంను పరిశీలించారు. రెండు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన పరికరాలకు పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ సైన్స్ పరికరం వెనక ఉన్న ఉపయోగం, పనితీరు, శాస్ర్తీయ సూత్రాలు అర్థమయ్యేలా చార్టులను ఏ ర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు, ఉపా ధ్యాయులు మ్యూజియం సందర్శనకు వచ్చి నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మ్యూజియం ప్రారంభం తర్వాత విద్యార్థులకు వివరించేందుకు సైన్స్ అధికారిని నియమించా లని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులును ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కోస్గి మునిసిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ విజయ్‌భాస్కర్, మునిసిపల్ కమిషనర్ నా గరాజు, తహసీల్దార్ కల్యాణి తదితరులు ఉ న్నారు.