వర్షం కోసం పూజలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:59 PM
:వర్షం కోసం కర్షకులు తడారిన కళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు.
- ఖిల్లాగణపురం శివాలయంలో ఘటాభిషేకం
- అలంపూర్ పాతాలేశ్వర స్వామి జలదిగ్బంధం
ఖిల్లాగణపురం/అలంపూర్/ఉండవల్లి, జూలై13(ఆంధ్రజ్యోతి):వర్షం కోసం కర్షకులు తడారిన కళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు. సమీప ఆలయాల్లో వరుణదేవా కరుణించవా అని పూజలు చేస్తున్నారు. అంతే కాకుండా వనప ర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని వివిధ మండలాల్లోని రైతులు ఆలయాల్లో అభిషేకాలు, జలదిగ్భందనలు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపు రం మండల కేంద్రంలోని కురువగేరి శివాలయంలో సోమవారం రైతులు, గ్రామస్థులు ఘటాభిషేకం చేశారు. పరమేశ్వరుడి ఆశీర్వాదంతో వర్షాలు సమృద్ధ్దిగా కురవాలని కోరుకున్నారు. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లా లోని అలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర నది నుంచి నీటిని తెచ్చి ప్రముఖ పుణ్య క్షేత్రమైన బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో స్వామి వా రికి అభిషేకం చేశారు. అనంతరం పాతాళేశ్వర స్వామిని జలదిగ్బంధం చేశా రు. ఉండవల్లి మండలం, ప్రాగటూరు ప్రజలు కృష్ణానదికి పాదదయాత్రగా వెళ్లి నది నీటిని బిందెలతో తీసుకువచ్చి గ్రామంలోని దేవతమూర్తులకు అభిషేకం చేశారు. మానవపాడు మండలంలోని చెన్నిపాడు, పల్లెపాడు శివాలయాల్లో అభిషేకం చేశారు.