Share News

వెలవెలబోయిన ప్రజావాణి

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:07 PM

గుండుమాల్‌లోని రైతువేదికలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమం వెలవెలబో యింది.

వెలవెలబోయిన ప్రజావాణి
ధన్వాడ తహసీల్‌లో సోమవారం ఉదయం ఖాళీగా దర్శనమిస్తున్న తహసీల్దార్‌ కుర్చీ

గుండుమాల్‌/ధన్వాడ, అక్టోబరు 5 (ఆంధ్ర జ్యోతి): గుండుమాల్‌లోని రైతువేదికలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమం వెలవెలబో యింది. కాగా అధికారులు ప్రతీవారం కార్యక్ర మానికి వచ్చి బయట కాలక్షేపం చేసి వెళ్లిపోతు న్నారని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమం పూ ర్తయ్యే ముందు కార్యాలయంలోకి వచ్చి సంత కాలు చేసి వెళ్లిపోతున్నారని వారు పేర్కొన్నారు. సోమవారం ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా ధన్వాడ పరిషత్‌ కార్యా లయంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదు దారులు రాక బోసిపోయింది. మండల స్థాయి అధికారులు కొందరు హాజరైనప్పటికి వినతులు సమర్పించడానికి ఫిర్యాదుదారులు ఒక్కరు కూ డా రాలేదని ఎంపీడీవో షేక్‌ అఫ్జల్‌ తెలిపారు.

సమయపాలన పాటించని తహసీల్దార్‌

ధన్వాడ (ఆంధ్రజ్యోతి): ధన్వాడ తహసీల్‌లో తహసీల్దార్‌, అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని మండల ప్రజలు పేర్కొన్నారు. కార్యాలయానికి వివిధ పనుల ని మిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం 10:49 గంటలు దాటినా కూడా అధికారులు, సిబ్బంది కార్యాలయానికి చేరుకోకపోవడం గమ నార్హం. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే కార్యాలయాలకు ఆలస్యంగా రావ డం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:07 PM