ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:32 PM
ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదే శించారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మండలాల్లోనూ ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు
గద్వాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అధికారులను ఆదే శించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 41 దరఖాస్తులు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 244 దరఖాస్తులు రాగా, వా టిలో ఇంకా 57 అర్జీలు మాత్రమే పరిష్కరించా ల్సి ఉందని తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి అన్నిశాఖల అధికారులు త ప్పకుండా హాజరై ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.