Share News

రానున్న ఎన్నికల్లో అధికారం బీసీలదే

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:42 PM

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారం బీసీలదేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు.

రానున్న ఎన్నికల్లో అధికారం బీసీలదే
ఎర్రవల్లి చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌ కార్నర్‌ మీటింగ్‌ లో మాట్లాడుతున్న మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

ఎర్రవల్లి/గద్వాల టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారం బీసీలదేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. జోగుళాం బ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గం ఎర్రవల్లి చౌరస్తా లో ఆదివారం కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. గద్వాల జిల్లా కేం ద్రం నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా చేరుకుని మాట్లాడారు. అలం పూర్‌ ఎమ్మెల్యే ఎవరో..? తనకు తెలియదని, ఆయనపై ఈప్రాంత పెత్తందారులే రాజకీయాలు శాసిస్తున్నారని, అలంపూర్‌ వారి తాత జాగీరా అని మండిపడ్డారు. కోటి ఎకరాల పేదల భూమిని రెడ్లకు, వెలమలకు భూమి పంచిన, నాటిముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అని అన్నారు. ఇక్కడ ఆయన వారసత్వం కొనసాగుతుందని విరు చుకుపడ్డారు. ఇంతమంది బీసీలపై ఐదువేల జనాభా ఉన్న వర్గం పెత్తనం చెలాయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిం చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు అలంపూర్‌ జనరల్‌గా మారి గద్వాల ఎస్సీకి రిజర్వు కానుందని అన్నారు. త్వరలో జరగబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. రాత్రి బీచుపల్లిలో బసచేశారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు సుదర్శన్‌గౌడ్‌, కోమ్ము ప్రవీణ్‌రాజ్‌, వనజక్క పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతతో మాటామంతీ

గద్వాల టౌన్‌, (ఆంధ్రజ్యోతి): బీసీ చైతన్యయాత్రలో భాగంగా ఆదివారం గద్వాల పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని తీన్మార్‌ మ ల్లన్న సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో మాట్లాడారు. సౌకర్యాలు, అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణం నాలు గేళ్లుగా నిలిపోయిందని తెలియడంతో కలెక్టర్‌, ఎంపీ మల్లురవితో ఫోన్‌లో మాట్లాడారు. నిధులు కేటాయించి, త్వరగా పూర్తి చేయిం చాలని కోరారు.

Updated Date - Oct 04 , 2026 | 11:42 PM