ధాన్యం కొనుగోలులో రాజకీయ జోక్యం తగదు
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:40 PM
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రా జకీయ జోక్యాన్ని నివారించాలని సీఐటీయూ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ కోరారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ
గద్వాల టౌన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రా జకీయ జోక్యాన్ని నివారించాలని సీఐటీయూ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకుసెంటర్ల నిర్వహణ సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ వీవోల సంఘం ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఐడీవోసీలో అదనపు కలెక్టర్ మధుమోహన్కు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడిన ఉప్పేరు నరసింహ, కొనుగోలు కేంద్రాల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించి, వీవో ఏలను నియమించాలని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా జిల్లాలోని కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. వీవోఏలకు బదులు నాయకుల అనుచరులు కేంద్రాల వద్ద చేస్తున్న హడావుడితో ఇతర పార్టీలకు చెందిన వారు అభ్యంతరాలు తెలపడంతో కొన్నిచోట్ల ఘ ర్షణ వాతావరణం నెలకొంటున్నట్లు అధికారి దృష్టికి తెచ్చారు. పైగాఇతరుల జోక్యంతో వీవోఏల గ్రేడింగ్ పడిపోవడంతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు తక్షణం జోక్యం చేసుకుని వీవోఏలకు రక్షణ కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఐకేపీ వీవోఏలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాం అంజి, కార్యదర్శి తిమప్ప, గౌరవ అధ్యక్షుడు వెంకటరామయ్య, సహాయ కార్యదర్శులు సరస్వతి, శ్రీనివాస్, వీవోఏలు లక్ష్మన్న, గోవిందమ్మ, రూతమ్మ, రాధమ్మ, సరస్వతి, పావని, లక్ష్మి, సత్యన్న, నారాయణ ఉన్నారు.