Share News

చోరీ కేసులను ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:43 PM

చోరీ కేసులను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఆరుగురు దొంగల ముఠాను పట్టుకుని నగ దు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు.

చోరీ కేసులను ఛేదించిన పోలీసులు

- ఆరుగురు నిందితుల అరెస్టు

- రూ.6లక్షల నగదు, కారు స్వాధీనం

కల్వకుర్తి/వంగూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చోరీ కేసులను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఆరుగురు దొంగల ముఠాను పట్టుకుని నగ దు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాల యంలో గురువారం వెల్దండ సీఐ రఘువీర్‌ రెడ్డి, వంగూరు ఎస్‌ఐ మహేష్‌లతో కలిసి డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కేసుల వివరాలను వెల్ల డించారు. ఇందుకు సంబంధించిన డీఎస్పీ కథనం ప్రకారం.. ఆరుగరు నిందితు లను అరెస్టు చేసి వారి నుంచి రూ.6లక్షల నగదు, ఆరు సెల్‌ఫోన్లుతో పాటు చోరీలకు వాడిన ఐరన్‌ రాడ్‌ను స్వాధీనం చేసుకున్న ట్లు డీఎస్పీ తెలిపారు. ఫిబ్రవరి 26న వం గూరు మండలం సర్వారెడ్డిపల్లిలో చిన్న పుల్లయ్య హైదరాబాద్‌కు వెళ్లాడు. వాళ్ల అ మ్మ పొలం వద్దకు వెళ్లగా, తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువా తాళం విరగొట్టి అం దులో ఉన్న అర తులం బంగారం, రూ.4.10 లక్షలు నగదు అప హరించారు. 27న స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీ సులు విచారణ చేశారు. ఫిబ్రవరి 25న అ చ్చంపేట మండలం హజీపూర్‌ గ్రామంలో రె డ్డెమోని సైదులు ఇం టికి తాళం వేసి బయ టకు వెళ్లారు. దుండగు లు తాళం విరగొట్టి చొరబడి బీరువా లాకర్‌ లో తెరిచి రూ,.5.80 లక్షల నగదు, ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, ఎత్తుకెళ్లారు. డిసెంబరు 16, 2025 సాయంత్రం నాగర్‌క ర్నూల్‌ పట్టణం లో ఈశ్వర్‌ కాలనీలో చంద్ర కళ అనే మహిళ మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కోని వెళ్లారు. అక్టోబరు 26, 2024న కల్వకుర్తి పట్ట ణంలోని పినిమిర తిరుపతమ్మ వద్దకు ఇద్ద రు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె మె డలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లారు.

గురువారం ఉదయం 10గంటల సమ యంలో సీఐ వెల్దండ, వంగూరు ఎస్‌ఐ, సి బ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు శ్రీ శైలం ఎక్స్‌ రోడ్డు దాబా వద్ద నేరస్తులు ఆరు గురు కారుతో పట్టుబడ్డారు. వారిని పట్టుకొని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించా లనే ఆశతో మద్యం అలవాటు, సరైన ఉపాధి లేకపోవడంతోనే ఒకరికొకరు పరిచయం ఏర్పరుచుకొని ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుల వివరాలు

కొలుకులపల్లి నాగేష్‌, పుట్ట వెంకట య్య, కుంచేపు సైదులు వీరి ముగ్గురిది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. ఎ నుముల జంగయ్య, పెరుమళ్ల రామస్వా మి, దొడ్డి యాదయ్య వీరిది వెల్దండ మండలం గుండాల గ్రామం. నిందితులు గతంలో ఎల్‌బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌, చైత న్యపురి ఏరియాలలో చోరీ కేసులలో జై లుకు వెళ్లినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిం దితులను పట్టుకోవడంలో ప్రతిభకనబ ర్చిన సీఐ రఘువీర్‌రెడ్డి, వంగూరు ఎస్‌ఐ మహేష్‌గౌడ్‌, పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Mar 05 , 2026 | 11:43 PM