Share News

విద్యార్థిని ప్రసవం కేసు ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:30 PM

వైద్య పరీక్షలకు వచ్చి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో స్కానింగ్‌ సెంటర్‌లో మగ బిడ్డను జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యాదవ్‌ బుధవారం వెల్లడించారు.

 విద్యార్థిని ప్రసవం కేసు ఛేదించిన పోలీసులు

- సమీప బంధువే ఈ గర్భానికి కారణం

- నిందితునిపై పోక్సో కేసు నమోదు

- అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

నాగర్‌కర్నూల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైద్య పరీక్షలకు వచ్చి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో స్కానింగ్‌ సెంటర్‌లో మగ బిడ్డను జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌యాదవ్‌ బుధవారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీబీవీ విద్యార్థిని వైద్య పరీక్షల కోసం వచ్చి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌లో మగ బిడ్డను జన్మనిచ్చి బిడ్డను చెత్తబుట్టిలో వేసి తప్పించుకుని వెళ్లే క్రమంలో నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పడంతో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. అయితే విద్యార్థిని తాను గత సంవత్సరం పదవ తరగతి చదువుకునేటప్పుడు ఒక విద్యార్థి పరిచయమయ్యాడని, అతని వల్లనే తాను గర్భం దాల్చినట్లు పేర్కొంది. అయితే ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదంటూ పేర్కొన్నాడు. అయితే మహిళా పోలీసుల సమక్షంలో కేజీబీవీ బాలికతో మరోసారి విచారించగా తన ఇంటి సమీపంలో ఉన్న తమ బంధువుతోనే గర్భం దాల్చినట్లు అమ్మాయి పేర్కొంది. ఈ సంఘటనపై అతన్ని అదుపులో తీసుకుని విచారించగా చేసిన తప్పును ఒప్పుకోవడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆ మైనర్‌ బాలున్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.

యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

బిజినేపల్లి మండలం గౌరారం గ్రామ శివారులో జగన్మోహన్‌(32) హత్య సంఘటనలో ముగ్గురు నిందితులు మిద్దె పరుశరాములు, కదిరే నాగరా జు, కదిరే పార్వతమ్మను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌, సీఐ అశోక్‌రెడ్డిలు బుధవారం తెలిపారు. వివరా ల ప్రకారం... నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన జగన్మోహన్‌ గుంపు మేస్త్రీ దగ్గర పని చేస్తూ లేబర్‌ను తీసుకెళ్లి పని చేసే క్రమంలో లట్టుపల్లి గ్రామానికి చెందిన మిద్దె ప రుశరాములుతో పరిచయం ఏర్పడింది. పరుశరా ములు మేస్త్రీ జగన్‌ దగ్గర ఒక మహిళకు డబ్బు లు ఇప్పించాడు. ఆమె పనికి రాకపోవడంతో డ బ్బుల కోసం జగన్మోహన్‌, మిద్దె పరుశరాములు ఇద్దరు కలిసి గౌరారం గ్రామానికి వె ళ్లి ఆమెను పనికి రమ్మని పి లిచారు. నేను పనికి రాలేను.. మీ డబ్బులు మీకు ఇస్తానని చె ప్పి 5వేల రూపాయలు ఇ చ్చింది. మిగతా డబ్బులు మా బంధువు చనిపోయా డు.. వెళ్లి వచ్చిన తర్వాత ఇ స్తానంటూ చెప్పి వెళ్లిపో యింది. ఇదే క్రమంలో మిద్దె పరుశరాములుకు సమీప బంధువైన కదిరే నాగరాజు ఇంటికి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడే ఉన్న క్రమంలో మార్చి ఒకటవ తేదీన మద్యం మత్తులో జగన్మోహన్‌ నాగరాజు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని గొడవ జరిగింది. జగన్మోహన్‌ తన సొంత గ్రామానికి వె ళ్లే క్రమంలో గౌరారం గ్రామ శివారులో వెళ్తుం డగా మిద్దె పరుశరాములు, కదిరే నాగరాజు, అ తని భార్య పార్వతమ్మలు వెనక నుంచి వెళ్లి రా ళ్లు, కర్రలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కొల్లాపూర్‌ పట్టణా నికి చెందిన మృతుని అన్న శివశంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Mar 04 , 2026 | 11:30 PM