Share News

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:40 PM

పాలమూరు నడి బొడ్డున కొంతకాలంగా గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార గుట్టు రట్టయ్యిం ది.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌, చిత్రంలో పట్టుబడిన నిందితులు

- నిర్వాహకురాలితో పాటు ఐదుగురి అరెస్టు

మహబూబ్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నడి బొడ్డున కొంతకాలంగా గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార గుట్టు రట్టయ్యిం ది. టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని స ద్దలగుండులో ఓ నివాసంలో కొన్నిరోజులుగా కార్యకలాపాలు నిర్వహిస్తు న్నారు. కాలనీకి చెందిన ఓ మహిళ తన నివాసంలో ఈటె మన్నెం సహ కారంతో ఈ దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వేపూర్‌ గ్రా మానికి చెందిన బోయిని శ్రీను, జడ్చర్ల మండలం గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన తోకల మహేశ్‌ తమకు తెలిసిన ఇద్దరు యువతులను తీసుకొచ్చి నివాసంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం పో లీసులకు అందింది. టూటౌన్‌ సీఐ, ఎస్‌ఐ శివనాగేశ్వర్‌ ఆధ్వర్యంలో సి బ్బంది దాడులు నిర్వహించారు. ఇద్దరు యువతులతోపాటు ఈటె మ న్నెం, బోయిని శ్రీను, తోకల మహేశ్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో నిర్వాహకురాలు ఇంట్లో లేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అదేరోజు రాత్రి బస్టాండ్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివా రం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Nov 29 , 2026 | 11:40 PM