పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:16 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడి యంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడా పోటీలను జి ల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మం గళవారం ప్రారంభించారు.
నారాయణపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడి యంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడా పోటీలను జి ల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మం గళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొంటే శారీరకం గా, ధృఢంగా ఉండడమే కాకుండా అన్నింటిలో చురుకుగా ఉంటారని, జిల్లాలోని క్రీడాకారులు బాగా రాణించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరా రు. ఈ సందర్భంగా జిల్లాలోని 19 పీఎంశ్రీ పా ఠశాలల నుంచి మొదటిరోజు వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి బ హుమతులు అందజేశారు.
విజేతలు వీరే..
వాలీబాల్ బాలుర మొదటి స్థానం జడ్పీ హెచ్‌ఎస్ గుండుమాల్, ద్వితీయ స్థానం జడ్పీ హెచ్‌ఎస్ బాలుర మరికల్, బాలికలు మొదటి స్థానం జడ్పీహెచ్‌ఎస్ గుండుమాల్, ద్వితీయ స్థానం టీజీఎంఎస్ గుండుమాల్, ఖోఖోలో మొ దటి స్థానం జడ్పీహెచ్‌ఎస్ కున్సీ, ద్వితీయ స్థా నం జడ్పీహెచ్‌ఎస్ బాలికలు ఊట్కూర్ నిలిచా యి. ఏఎంవో విద్యాసాగర్, ఎస్‌జీఎఫ్ నారాయ ణపేట జిల్లా సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు నర్సిములు, రత్నయ్య, బాలరా జు, వెంకటప్ప, సాయినాథ్, వెంకటేష్, మౌలా నా, అనంతసేన, శ్రీధర్, రామకృష్ణారెడ్డి, పారిజా త, వేణుగోపాల్, అక్తర్‌పాషా, విష్ణువర్దన్, పారి జాత, సౌమ్య, కృష్ణవేణి, బీరప్ప పాల్గొన్నారు.
కళల్లో రాణించి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలి
రాష్ట్రస్థాయిలో కళల్లో రాణించి జిల్లాకు ప్ర త్యేక గుర్తింపు తేవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. జిల్లా కేంద్రంలోని జవహర్ బాల కేం ద్రంలో మంగళవారం నిర్వహించిన కళలు, సాం స్కృతిక పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హా జరై, మాట్లాడారు. నృత్య విభాగంలో శివానీ బృందం (దామరగిద్ద జడ్పీహెచ్‌ఎస్) సంగీత విభాగంలో జానకి (నర్వ మండలం పెద్దకడ్మూ ర్ జడ్పీహెచ్‌ఎస్) వాయిద్య సంగీతంలో శివాని (నారాయణపేట గ్రౌండ్ హైస్కూల్) అర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో నవ్యప్రియ (ఊట్కూర్ జడ్పీ హెచ్‌ఎస్) రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ము ఖ్య అతిథులు వారికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. సెక్టోరియల్ అధికారి విజయ్ సాగర్, నాగార్జునరెడ్డి, పీఎంశ్రీ కోఆర్డినేటర్ కన కప్ప, చిత్రకారుడు అక్కల లక్ష్మణ్, నర్సప్ప, బాల కేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, సంగ నర్సింహులు, వసంత్, జ్ఞానామృత పాల్గొన్నారు.