నేడు పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:33 PM
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సం సద్ ఖేల్ మహోత్సవ్‌లో భాగంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం శుక్రవారం జిల్లా డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వ హించనున్నారు.
- రానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ జానకి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సం సద్ ఖేల్ మహోత్సవ్‌లో భాగంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం శుక్రవారం జిల్లా డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వ హించనున్నారు. గురువారం స్టేడియం మైదానంలో ఏర్పాట్లను బీజేపీ జి ల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో పోటీలను విజ యవంతంగా నిర్వహించామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంట లకు ముగింపు వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రావు, శా సనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవీఎన్.రెడ్డి హాజరువుతారన్నారు. అంత ర్జాతీయ మహిళా క్రికెటర్లు డైన డేవిడ్, గొంగడి త్రిషరెడ్డి, డబ్ల్యూపీఎల్ క్రి కెటర్ త్రిష పూజిత ముగింపు వేడుకలకు హాజరు కానున్నట్లు వెల్లడించా రు. వేడుకలను ప్రజలు, క్రీడాభిమానులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా గవర్నర్ రానున్న నేపథ్యంలో స్టేడియా న్ని ఎస్పీ డి.జానకి పరిశీలించారు. కార్యక్రమంలో పీఎంఎస్‌కేఎం పార్ల మెంట్ ఇన్‌చార్జి ముచ్చర్లపల్లి జనార్ధన్‌రెడ్డి, బి.బాల్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎం.నవీన్‌రెడ్డి, బి.నవీన్, భరత్, ఆనంద్, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.