Share News

ప్లాస్టిక్‌ రహిత పట్టణం కోసం సహకరించాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:27 PM

గద్వాలను ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిందేందు కు చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత పట్టణం కోసం సహకరించాలి
ఫ్యాక్టరీలో బయో డిగ్రేడబుల్‌ కవర్లను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి

  • గద్వాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి

గద్వాలటౌన్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గద్వాలను ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిందేందు కు చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి అన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు ఇప్పటికే మునిసిపల్‌ కౌన్సిల్‌ తరఫున నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో పర్యావరణ హితమైన బయో డిగ్రేడబుల్‌ కవర్ల తయారీ ప్రక్రియను సోమవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానిక ఈకో-లైఫ్‌ ఫ్యాక్టరీని పరిశీలించారు. నాలుగురోజుల క్రితం చైర్‌పర్సన్‌ భర్త, మాజీ కౌన్సిలర్‌ తుమ్మల నరసింహులు నేతృత్వంలోని కౌన్సిలర్ల బృందం కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న ఫ్యాక్టరీని పరిశీలించివచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రామలింగేశ్వర కాంళ్లే, చంద్రశేఖర్‌, నాయకులు మోషిన్‌, నరహరిగౌడ్‌, రిజ్వాన్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:27 PM