Share News

క్రికెట్‌ ఆడడం సులువు రాయి కొట్టే పని కష్టం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:36 PM

మైదానంలో క్రికెట్‌ ఆడడం సులువే కానీ, ఎండలో రాయి పగల గొట్టడం ఎంతో కష్టమని మైనా ర్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు.

క్రికెట్‌ ఆడడం సులువు రాయి కొట్టే పని కష్టం
మాట్లాడుతున్న మహమ్మద్‌ అజారుద్దీన్‌

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌

కొత్తకోట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : మైదానంలో క్రికెట్‌ ఆడడం సులువే కానీ, ఎండలో రాయి పగల గొట్టడం ఎంతో కష్టమని మైనా ర్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. సోమవా రం వనపర్తి జిల్లా కొత్తకోటలో దేవరకద్ర నియోజకవర్గంలోని 90 మంది కాశ ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన పనిముట్లను ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ ముస్లింలు అత్యంత కష్టమైన వృత్తిలో జీవనోపాధి పొందుతున్నారని వాపోయారు. ఇలా జీవనోపాధి పొందుతున్న వారికి పని సులువుగా ఉండేందుకు రూ.60 వేల విలువైన జనరేటర్‌, రాయిని కోసే రంపం, ఇతర టూల్‌ కిట్స్‌ అందజేశామన్నారు. అన్ని కులవృత్తుల వారి అభివృద్ధే ప్రభుత్వ ధ్వేయమన్నారు. దేవరకద్ర నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కమ్యూనిటీ హాల్స్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా త్వరలోనే మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, సీడీసీ, మార్కెట్‌ చైర్మన్‌లు చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంత్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పల్లవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:36 PM