Share News

మొక్కలు నాటండి.. భూమిని కాపాడండి

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:04 PM

పర్యావరణ రక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించేం దుకు మండల కేంద్రానికి చెందిన 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఆది వారం సైకిల్‌ యాత్ర చేపట్టారు.

మొక్కలు నాటండి.. భూమిని కాపాడండి
సైకిల్‌పై యాత్ర నిర్వహిస్తున్న విద్యార్థులు

నర్వ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ రక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించేం దుకు మండల కేంద్రానికి చెందిన 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఆది వారం సైకిల్‌ యాత్ర చేపట్టారు. నర్వ నుంచి చంద్రగట్టు వరకు సాగిన ఈ యాత్రలో విద్యా ర్థులు చెట్లు నాటండి.. భూమిని కాపాడండి.. ప్రకృతి వ్యవసాయం చేద్దాం.. పచ్చని గ్రామం అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. యాత్ర నర్వ నుంచి ప్రారంభమైన యాంకీ, పె ద్దకడుమూరు, గట్టు గ్రామాల గుండా కొనసా గింది. ప్రజలను కలుసుకుని పర్యావరణ రక్షణ అవసరాన్ని వివరించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, చెట్లు నాటడం, ప్రకృతి వ్యవసా యం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిం చవచ్చని ఉపాధ్యాయులు వివరించారు.

Updated Date - Mar 01 , 2026 | 11:05 PM