Share News

ఉత్సాహంగా గులాబీ శ్రేణుల 5కే రన్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:23 PM

జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్త యిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం గద్వాల పట్టణంలో నిర్వహించిన 5కే రన్‌ ఉత్సా హంగా సాగింది.

ఉత్సాహంగా గులాబీ శ్రేణుల 5కే రన్‌
గద్వాలలో 5కే రన్‌లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

  • విద్యార్థులతో కలిసి జిల్లా ఆవిర్భావ వేడుక

గద్వాల టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్త యిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం గద్వాల పట్టణంలో నిర్వహించిన 5కే రన్‌ ఉత్సా హంగా సాగింది. స్థానిక పాతబస్టాండ్‌ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన రన్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ ని యోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌లు ప్రారంభించారు. కృష్ణవేణిచౌక్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, రాజీవ్‌మార్గ్‌ తదితర ప్రధాన రహదారుల మీదుగా సాగిన రన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మా జీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో క లిసి కేక్‌ను కట్‌చేసిన నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్థాయి మొదలుకుని జిల్లాస్థాయి నాయకులు పెద్దసంఖ్యలో భాగస్వా ములు కావడం విశేషం.

Updated Date - Oct 09 , 2026 | 11:23 PM