క్రీడలతో శారీరక ధృడత్వం
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:35 PM
క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
భూత్పూర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. భూత్పూర్ మునిసిపాలిటీ 2వ వార్డులో పరిధిలోని శేరిపల్లి (బీ) గ్రామ శివారులో యువకులు పాపులర్ క్రికెట్ హబ్‌ను ఏర్పాటు చేయగా, ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. యువత చెడుదారిలో పడకుండా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, షటీల్ వంటి క్రీడలు ఆడాలన్నారు. మునిసిపల్ చైర్మన్ బాలకోటి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లిక్కీ నవీన్‌గౌడ్, వార్డు కౌన్సిలర్లు అన్నపూర్ణమ్మ, లాలునాయక్, సర్పంచు సంజీవరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు పవన్‌కుమార్, అప్రోజ్, నరేందర్, డాక్టర్ యాషిన్ పాషా పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
దేవరకద్ర : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలం వెంకంపల్లి, రేకులంపల్లి, ఇస్రంపల్లి, పేరూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన దుస్తులు అందజేసి. మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పదేళ్ల్లఓ ఏ గ్రామంలో ఒక ఇంటిని కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు దశల వారిగా అమలు చేస్తోందన్నారు. టీపీసీసీ కార్యదర్శి అరవింద్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డ్డి, ఆయా గ్రామాల సర్పంచులు శృతిరెడ్డి, కాంత్‌రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.