Share News

అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్షపడాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:42 PM

: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లురవి అధికారులను ఆదేశిం చారు.

అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్షపడాలి
సమావేశానికి హాజరైన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ

- దౌర్జన్యాలపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి

- ఎంపీ మల్లురవి

వనపర్తి, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లురవి అధికారులను ఆదేశిం చారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలె న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై కేసుల పురోగతిని సమీ క్షించారు. 2018 నుంచి నమోదైన అట్రాసిటీ కేసులు, బాధితులకు చెల్లించిన పరిహారం, విచారణ స్థితిగతు లపై సమీక్షించారు. 2025-26 కాలంలో విచారణలో ఉన్న 12 కేసుల పురోగతిని ఎస్పీ డి.సునీతరెడ్డి వివ రించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 20 20 నుంచి 2026 వరకు ఒక్క కేసులో కూడా నేరారో పణ జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు. తప్పు చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష పడేలా ఆధారా లతో చార్జ్‌షీటు దాఖలు చేయాలని ఆదేశించారు. భూ ఆక్రమణలు, ఎస్సీ, ఎస్టీల భూముల కబ్జా వంటి కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశానికి అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హాజరు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చే శారు. అనంతరం సంక్షేమ శాఖల పనితీరుపై సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు బాధితులకు అందించాల్సిన పరిహారం సుమారు రూ.75లక్షల నిధులు పెండిం గ్‌లో ఉన్నాయని, వాటి విడుదల చేయించాలని ఎంపీని కోరారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశా లల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది, వారికి అవసరమైన అదనపు వసతి గృహాలను మంజూరు చేయా లని కోరారు. సమావేశంలో అద నపు కలెక్టర్‌ ఖీమ్యా నాయ క్‌, జడ్పీ సీఈవో యాద య్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 16 , 2026 | 11:42 PM