నగరానికి శాశ్వత తాగునీటి ప్రణాళిక
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:36 PM
పాలమూరులో శాశ్వత తా గునీటి పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించినట్లు ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- రూ.108.9 కోట్లతో 4 ఓవర్‌హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో శాశ్వత తా గునీటి పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించినట్లు ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 2047 సంవత్సరం నాటికి పెరిగే జ నాభాను దృష్ఠిలో ఉంచుకుని తాగునీటి పఽథకం చేపడుతున్నామన్నారు. యూఐడీఎఫ్ నిధులతో నగరంలో 14 ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ ని ర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. గురువారం నగరంలోని పలు డివిజ న్‌లలో 4 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇ ప్పటికే నాలుగుచోట్ల ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, మ రో ఆరు చేయాల్సి ఉందన్నారు. ఒక్కరోజే రూ.108.9 కోట్ల విలువ చేసే ప నులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇందులో 3వ డివిజన్ తిరుమల హి ల్స్ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రూ.13.8కోట్లతో 500 కిలోలీ టర్ల సామర్ధ్యంతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం, 6వ డివిజన్‌లోని సాంబశి వాలయం దగ్గర రూ. 38.2 కోట్లతో 2వేల కిలోలీటర్ల ట్యాంక్, 22వ డివిజన్ పద్మావతికాలనీలో రూ. 25.8 కోట్లతో 1200 కిలోలీటర్ల సామర్థ్యం గల ట్యాంక్, 45వ డివిజన్‌లో రూ.31 కోట్లతో 1500 కిలో లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్‌లను నిర్మించనున్నామన్నారు. ఈ పనులన్నీ పూర్తైతే ప్రతిరోజు నగ రానికి తాగునీరు అందుతుందన్నారు. నగర మేయర్ మమత, డిప్యూటీ మే యర్ ఎం సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కమిషనర్ రా మాంజులరెడ్డి, కార్పొరేటర్‌లు రామస్వామి, జ్యోతి, సాల్మన్ పాల్గొన్నారు.