Share News

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:51 PM

ప్రజాప్రభుత్వం రైతులకు అం డగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

 రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం
రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): ప్రజాప్రభుత్వం రైతులకు అం డగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలో సోమవారం ఎన్‌ఎం ఈవో పథకం కింద సబ్సిడీపై వేరు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగు సమయంలో అవసర మైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందేలా అధికారు లు ప్రత్యేక దృష్టి సారించాల ని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందు కు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాన వాజ్‌ఖాన్‌, ఇన్‌చార్జి ఏడీఏ మంజుల, ఏవో సురేశ్‌, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డి, నాయ కులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:51 PM