జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షలు సాకారం
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:35 PM
రాష్ట్ర సాధన అనంతరం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేర్చేందుకు అప్పటి సీఎం కేసీ ఆర్ 33జిల్లాలను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, అందులో గద్వాల జిల్లా ఉం డటంతో చాలా సంతోషంగా ఉందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నా యుడు అన్నారు.
- ఉద్యమకారుల సన్మాన సభలో బాసు హనుమంతునాయుడు
గద్వాల, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాధన అనంతరం పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేర్చేందుకు అప్పటి సీఎం కేసీ ఆర్ 33జిల్లాలను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, అందులో గద్వాల జిల్లా ఉం డటంతో చాలా సంతోషంగా ఉందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నా యుడు అన్నారు. శనివారం నాగర్‌దొడ్డి వెంకట్రాములు అధ్యక్షతన ఓ ప్రైవేటు ఫంక్షన్‌హా ల్‌లో గద్వాల జిల్లా ఏర్పడి పదేళ్లు అయిన సం దర్భంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం గా హనుమంతునాయుడుతో పాటు కురువ వి జయ్‌కుమార్, బీఎస్ కేశవ్, పలువురు ఉద్యమకారులు మాట్లాడారు. గద్వాల ప్రాంతం ఉమ్మ డి మహబూబ్‌నగర్‌కు చాలా దూరంగా ఉం డటంతో సేవలు ప్రజలకు అందక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రజల అవసరాలను ప్రాం తీయ ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్ గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను చేరువ చేశారని కొనియాడారు. విద్య, వైద్యపరంగా అన్ని రంగాలలో అభివృద్ధికి బాటలు ప డ్డాయని గుర్తుచేశారు. మెడికల్ కళాశాల, న ర్సింగ్ కాలేజీ లాంటివి వచ్చాయని అన్నారు. రై తాంగానికి సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల ప్రాజెక్టు, గట్టు ఎత్తిపోతల పథకం వంటివి కూ డా జిల్లా ఏర్పాటు తర్వాత వచ్చినవేనని గుర్తుచేసుకున్నారు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం చేయక తప్పలేదని వనపర్తిలోని కొందరి నాయ కుల స్వార్థం వలన జిల్లా ఏర్పాటుకు అడ్డం కులు వచ్చాయని గుర్తుచేశారు. అయితే ప్రజల ఆకాంక్షను గుర్తించిన ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేయక తప్పలేదనేది కూడా వాస్తవమైన విష యమని అన్నారు. సమావేశంలో కుర్వపల్లయ్య, రాఘవేంద్రరెడ్డి, పరేశ్‌బాబు, నాగరాజు, డాక్టర్ నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.