పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:33 PM
పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను వెంటనే వి డుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫారెన్ మె డికల్ గ్రాడ్యుయేట్స్(మెడికోలు) శనివారం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు.
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను వెంటనే వి డుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫారెన్ మె డికల్ గ్రాడ్యుయేట్స్(మెడికోలు) శనివారం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికో లు నవీణ్, భరత్ మాట్లాడుతూ.. విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి స్వదేశంలో ఎఫ్‌ఎమ్ జీఈ (ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తమకు కేవలం నెలకు రూ. 5 వేలు మా త్రమే ఇస్తున్నారని, అది కూడా 9 నెలలుగా పెం డింగ్‌లో ఉన్నదన్నారు. అ లాగే ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారికి రూ. 29,792 స్టైఫండ్ ఇస్తున్నారని అన్నారు. నేషనల్ మె డికల్ కౌన్సిల్, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమకు కూడా రూ.29,792 స్టైఫండ్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా రాష్ట్రంలో మాత్రం అమలు కా వడం లేదన్నారు. ఒక కూలీ చేసిన వ్యక్తికి కూ డా ఇంత తక్కువ డబ్బులు రావని, ఎంబీబీఎస్ చేసిన తమకు రోజుకు రూ. 166 మాత్రమే ఇ వ్వడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో డాక ్టర్లు మైథిలి, ఓంకార్, సాయికిరణ్, నిహిత, సోనిక తదితరులు పాల్గొన్నారు.