పెండింగ్ జీతాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:22 PM
తమకు పెండింగ్ జీతాలివ్వాలని ఓ పరిశ్రమ ముందు కార్మ కులు ఆందోళనకు దిగారు.
- ఆల్కహాల్ కంపెనీ ముందు కార్మికుల ఆందోళన
అలంపూరుచౌరస్తా/మానవపాడు, జన వరి 13 (ఆంఽధ్రజ్యోతి): తమకు పెండింగ్ జీతాలివ్వాలని ఓ పరిశ్రమ ముందు కార్మ కులు ఆందోళనకు దిగారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా మానవపాడు మండలం, కలు కుంట్ల గ్రామ శివారులోని ఆల్కహాల్, సౌందర్య సాధనాలు, బాడిస్ర్పే, టాయిలెట్ క్లీనర్స్‌లో వాడే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహా ల్ (ఈఎన్‌ఐ) తయారయ్యే ఓ పరిశ్రమ ఎ దుట మంగళవారం సుమారు వందమంది కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇదే కం పెనీలో మూడేళ్ల క్రితం వరకు పని చేశా మని, అప్పటి కంపెనీలో పని చేసే 143 మందికి 11 నెలల జీతాలు పెండింగ్ పెట్టి కంపెనీని నిలిపేశారని కార్మికులు అన్నారు. కంపెనీ మూత పడ్డాక పలుమార్లు యా జమాన్యాన్ని అడిగినా పట్టించుకోకపోవడం తో లేబర్ కార్యాలయాలకు, అప్పటి జిల్లా అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా తమ జీతాలు ఇవ్వలేదన్నారు. తాజాగా ఇ దే కంపెనీ మరో యాజమాన్యం చేతుల్లోకి పోయింది. ఇది తెలుసుకున్న మే ము తమ కష్టా నికి న్యాయం చే యాలని, కంపె నీ ఓపెన్ అయి తే మమ్మల్నే తి రిగి విధుల్లోకి తీ సుకోవాలని అ భ్యర్థించా మన్నా రు. ఇందుకు నూతన యాజ మాన్యం తప్పక న్యాయం చేస్తా మని చెప్పి కంపెనీ నిర్వహణ మూడు నె లల క్రితం ప్రారంభమైనా మొఖం చాటే స్తున్నారని ఆరోపించారు. పైగా పాతవారమైన మాకు అవకాశం ఇవ్వకుండా ఇతర రాష్ర్టాల నుంచి కార్మి కులను తీసుకుంటున్నారని మండిపడ్డా రు. తమకు న్యాయం చేయాలంటూ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం అక్కడికి చేరుకుని కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెండింగ్ జీతాలు ఇ వ్వకపోవడం దారుణమని యాజమాన్యం పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలల జీతాలిస్తూ, పాత కార్మికులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలుకుం ట్ల మాజీ సర్పంచు ఆత్మలింగారెడ్డి అక్కడి కి చేరుకుని ఇరువురి మధ్య సయోధ్య కూదిర్చేందుకు ప్రయత్నించారు. ఇందుకు యాజమాన్యం మూడు నెలల జీతాలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కార్మికులు ససేమిరా అన్నారు. దీంతో కొన్ని రోజులు గడువు ఇవ్వాలని యాజమాన్యం కోరినట్లు కార్మికులు తెలిపారు.