Share News

పెండింగ్‌ డబ్బులు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:30 PM

పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి 2024-2025 ఏడాది పెండింగ్‌ డబ్బులు రూ.65 లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని పది స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు.

పెండింగ్‌ డబ్బులు ఇవ్వాలి
మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

పెండింగ్‌ డబ్బుల కోసం రెండు గంటలపాటు విధుల బహిష్కరణ

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి 2024-2025 ఏడాది పెండింగ్‌ డబ్బులు రూ.65 లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని పది స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు. మూల్యాంకనం ప్రారంభించకుండా రెండు గంటల పాటు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పరీక్ష విభాగం అధికారి కమలాకర్‌ శర్మ, ఇతర అధికారులను మూల్యాంకన కేంద్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మా ట్లాడుతూ గత ఏడాదిలో పదో తరగతి జ వాబు పత్రాల మూల్యాంకనం డబ్బులు ఇంకా ఇవ్వలేదని మండి మడ్డారు. మంగళవారంలోగా పెండింగ్‌ డబ్బులు ఇవ్వకుంటే పూర్తిగా మూల్యాంకనం బహిష్కరిస్తామని అన్నారు. ఈ ఏడాది మూల్యాంకనం ప్రారంభమై మూడు రోజులు గడిచినా.. ఇప్పటి వరకు కనీస వసతులు కల్పించలేదన్నారు. తాగునీరు, క్యాంటిన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. మూల్యాంకనం చేసేందుకు పేపర్‌కు 15 ఏళ్ల కింద ఉన్న రేట్లు ఉన్నాయని, ఇంటర్‌, డిగ్రీ పత్రాలకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏసీఓ కమలాకర్‌శర్మ, డైట్‌ ప్రిస్సిపాల్‌ మిరాజుల్లాఖాన్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి, త్వరలోనే డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 11:30 PM