Share News

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:35 PM

ప్రభుత్వ ఉద్యోగులుగా 36 ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్డ్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలు వెంటనే పరిష్కరించాలని ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ఫారుఖ్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి
డైరీని ఆవిష్కరిస్తున్న ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ఫారుఖ్‌ హుస్సేన్‌

- ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ఫారుఖ్‌హుస్సేన్‌

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగులుగా 36 ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్డ్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలు వెంటనే పరిష్కరించాలని ఆల్‌మేవా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ఫారుఖ్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆల్‌మేవా డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. ఏళ్ల తరబడి బెనిఫిట్స్‌ అందకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని, గతంలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ అధికారం కట్టబెట్టారని గుర్తుచేశారు. ప్రత్యేకంగా రూ.1500 కోట్లు కేటాయించి ఆర్థిక సమస్యలు పరిష్కరానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర సెక్రటరీ వహీద్‌షా, కోశాధికారి మహ్మద్‌ రశీద్‌, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ఖలీల్‌, నాయకులు హబీబ్‌ అబ్దుల్‌రహెమాన్‌, యూసుఫ్‌బిన్‌ నాసర్‌, సయ్యద్‌ నిజాముద్దీన్‌, హబీబ్‌, ఎజాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:35 PM