ఆధ్యాత్మికతతో ప్రతీ ఒక్కరికి ప్రశాంతత
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:44 PM
ప్రతీ గ్రామంలో గుడి, బడి తప్పనిసరిగా ఉండాలని దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలు భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించడం వల్ల శాంతి కలుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
కేటీదొడ్డి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రతీ గ్రామంలో గుడి, బడి తప్పనిసరిగా ఉండాలని దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలు భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించడం వల్ల శాంతి కలుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నందిన్నె గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని ప్రతీ ఒక్కరు హిందూ ధర్మాన్ని కాపాడాలని సూచించారు. గ్రామంలో రైతులు పాడి పరిశ్రమపరంగా అన్ని రంగాల్లో గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని స్వామి వారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం నందిన్నె ప్రకాష్‌రావు స్వామి స్వగృహంలో పీఠాధిపతి స్వామి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు ఉరుకుందు, మైలగడ్డ చంద్రశేఖర్, రంగారెడ్డి, వెంకటేశ్, మహాదేశ్, వీరేశ్, రంగస్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.