జిల్లా ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:04 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని పరికరాలు ఉన్నా అందుకు సంబంధించిన డాక్టర్లు, రేడియాలజిస్ట్ లేకపోవడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారు.
రేడియాలజిస్ట్ లేక ఇబ్బందులు
స్ట్రెచర్ ఉన్నా వినియోగించక అవస్థలు
గద్వాల క్రైం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని పరికరాలు ఉన్నా అందుకు సంబంధించిన డాక్టర్లు, రేడియాలజిస్ట్ లేకపోవడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారు. స్కానింగ్ చే యాల్సిన రేడియాలజిస్ట్ నెలపాటు సెలవులో ఉండటంతో స్కానింగ్ ఎలా చేసుకోవాలని రోగు లు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసు పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేదలే ఉం టారని, అయితే పేదలకు డబ్బులు ఎలా వస్తాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మండలం కొండపల్లికి చెందిన ఆశావర్కర్ దేవమ్మకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బుధవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో అందు బాటులో స్ర్టెచర్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ బంధువులే ఆసుపత్రిలోని బెడ్‌పైకి మోసుకెళ్లారు. అయితే డ్యూటీ డాక్టర్ పరిశీలించి పరీక్షలు నిర్వహించి అబ్డామిన్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సంబంధిత రేడియాలజిస్ట్ సెలవులో ఉన్నందు వల్ల బయట చేయిం చుకొని రావాలని ఆసుపత్రి వర్గాలు సూచించారన్నారు. అయితే నెలపాటు సెలవులో ఉంటే మ రొకరిని రేడియాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాల్సిన ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడంలేద ని బాధిత బంధువులు మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్థికంగా లేని పేదవారే ఎక్కువగా వస్తుంటారని, స్కానింగ్‌లకు రూ.వేలకు వేలు ఎక్కడి నుంచి తెస్తారని ఆవేదన వ్యక్తం చేశా రు. అంతేకాక సిటీ స్కాన్ కూడా రాశారని, దా నికి రూ.5వేలు అవుతుందని వాపోతున్నారు. ఇలా సిబ్బంది లేకపోవడంతో కర్నూల్, హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పడంతో రోగుల ప్రాణాలు మధ్యలోనే పోవాల్సివస్తుందన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాకర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ఈ విషయంపై ఆర్‌ఎంవో డాక్టర్ హేమలతను వివరణ కోరగా రేడియాలజిస్ట్ పెళ్లి ఉన్నందు వలన నెల పాటు సెలవులో వెళ్లాడని తెలిపారు. రేడియాలజిస్ట్ లేడనే విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యేకు కూడా తెలిపామని చెప్పారు.