పీఆర్సీ ప్రకటన చేయకపోతే ఉద్యమబాట
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:58 PM
ప్రభుత్వం ఐదు రోజుల్లో పీఆర్సీ ప్రక టన చేయకపోతే ఉద్యమబాట పడతామని పీ ఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ హెచ్చరించారు.
- పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్
నారాయణపేట, సెప్టెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ఐదు రోజుల్లో పీఆర్సీ ప్రక టన చేయకపోతే ఉద్యమబాట పడతామని పీ ఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ హెచ్చరించారు. బుధవారం సాయం త్రం నారాయణపేట అంజనా గార్డెన్‌లో పీఆర్టీ యూటీఎస్ జిల్లా సర్వసభ్య కౌన్సిల్ సమావేశా నికి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ జేఏసీతో జరిగిన చర్చల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు అసంతృప్తి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, గౌరవ అధ్య క్షుడు తిరుపతి, వివిధ మండలాల అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు రఘువీర్, సత్యనారాయణ రెడ్డి, గోవర్ధన్, సూర్యప్రకాష్, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి, వెంకటేష్, దండుశేఖర్, నవీన్ వెంకటేష్, ప్రకాష్‌గౌడ్, శ్రీనివాసరావు, వాణిశ్రీ, ఎంఈవోలు ఆంజనేయులు, జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంలు సు నీత, నాగరత్న, మహిళా నాయకురాలు వర లక్ష్మి, సబాసుల్తానా, రాష్ట్ర, జిల్లా మండల కౌ న్సిల్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.