Share News

విశ్వాసులకు దేవుడికి మధ్యవర్తులే పాస్టర్లు

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:35 PM

ప్రజలు నరకానికి కాకుండా, పరలోక వారసులుగా ఉండేలా దేవుడు పాస్లర్లును త న ప్రతినిధులుగా ఏర్పర్చుకున్నారని బ్రదర్‌ శ్యామ్‌ సుందర్‌ అభివర్ణించారు.

విశ్వాసులకు దేవుడికి మధ్యవర్తులే పాస్టర్లు
పాస్టర్లను సన్మానిస్తున్న చర్చి కమిటీ సభ్యులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : తన ప్రజలు నరకానికి కాకుండా, పరలోక వారసులుగా ఉండేలా దేవుడు పాస్లర్లును త న ప్రతినిధులుగా ఏర్పర్చుకున్నారని బ్రదర్‌ శ్యామ్‌ సుందర్‌ అభివర్ణించారు. అంతర్జాతీయ పాస్టర్స్‌ డే సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని రెమా వర్షిప్‌ సెంటర్‌లో పాస్టర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెమా వర్షిప్‌ సెంటర్‌ డైరెక్టర్‌ పాస్టర్‌ బీఎస్‌ పరంజ్యోతి, ఆయన సతీమణిని సత్కరించారు. పాస్టర్లు విశ్వాసుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. వివిధ రుగ్మతలతో చర్చికి వచ్చే విశ్వాసుల కోసం కన్నీటితో దేవుడిని పార్థించి వారిని స్వస్తులను చేస్తున్నారని కొని యాడారు. సంఘ పెద్దలు రమేష్‌, దేవయ్య, ప్రసన్నకుమార్‌, మహేందర్‌, అబ్రహం, బ్టాండీన, మహిమ, సధ్య, మణెమ్మ పాల్గొన్నారు.

15 నుంచి ఉపావాస ప్రార్థనలు

రెమా వర్షిప్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 17 వరకు జిల్లా కేంద్రంలోని జేజేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉపవాస ప్రార్థన పండుగలు నిర్వహి స్తున్నట్లు పాస్టర్‌ పరంజ్యోతి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిర్వహించే ఈ ప్రార్థనలకు అంర్జాతీయ ముఖ్య ప్రసంగీకులు హాజరై దేవుని వాక్యం వినిపిస్తారన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 11:35 PM