అణగారిన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:45 PM
బడుగు బలహీన, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి పండుగ సాయన్న అని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : బడుగు బలహీన, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి పండుగ సాయన్న అని ఎస్పీ జానకి పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళి అర్పించారు. నవాబ్‌పేట మండలానికి చెందిన ఆయన జిల్లా ప్రజల పక్షాన పోరాటం చేశారని, ఆయన పోరాటాన్ని గుర్తించి పభ్రుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, ఏవో రుక్మిణి, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ మోతీరామ్, ఆర్‌ఐ అడ్మిన్ కృష్ణయ్య పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఆర్వో నిర్మల, ఏవో సువర్ణరాజ్ పాల్గొన్నారు.
జడ్చర్ల : పట్టణంలోని సిగ్నల్‌గడ్డ చౌరస్తాలో పండుగ సాయన్న చిత్రపటానికి ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పుష్పలత, బాదేపల్లి మాజీ సర్పంచు రేణుక, మురళి, కృష్ణయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : మండలంలోని భైరంపల్లితో పాటు మండల కేంద్రంలో పండుగ సాయన్న చిత్రపటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బహుజన సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.
మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని మత్స్యశాఖ భవనంలో పండుగ సాయన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
మహబూబ్‌నగర్ రూరల్ : మండలంలోని ధర్మాపూర్, కోడూర్, మణికొండ, గాజులపేట, మాచన్‌పల్లి గ్రామాల్లో పండుగ సాయన్న చిత్ర పటానికి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రాజగౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
హన్వాడ/నవాబ్‌పేట/గండీడ్/కోయిలకొండ/రాజాపూర్ : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో పండుగ సాయన్న కమిటీ ఆధ్వర్యంలో పండుగ సాయన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నవాబ్‌పేట మండల కేంద్రంలో సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ చైర్మన్ హరలింగం పండుగ సాయన్న విగ్రహానికి ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో సర్పంచు నవనీత పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కోయిలకొండ మండల కేంద్రంలో వచ్చే పండుగ సాయన్న జయంతి వరకు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి నివాళి అర్పించారు. రాజాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పంచారు.