పోలీస్ స్పోర్ట్స్‌మీట్‌లో పాలమూరుకు 13 పతకాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:27 PM
రాష్ట్ర 4వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్‌మీట్‌లో పాలమూరు పోలీసులు ప్రతిభ కనబరిచారు. 13 పతకాలు సాధించి జిల్లా గౌరవం పెంచారు. సైబరాబాద్ కమిషనర్ వేదికగా నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్‌మీట్‌లో 2 గోల్డ్, 3 రజతం, 8 కాంస్య పతకాలు సాధించారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర 4వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్‌మీట్‌లో పాలమూరు పోలీసులు ప్రతిభ కనబరిచారు. 13 పతకాలు సాధించి జిల్లా గౌరవం పెంచారు. సైబరాబాద్ కమిషనర్ వేదికగా నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్‌మీట్‌లో 2 గోల్డ్, 3 రజతం, 8 కాంస్య పతకాలు సాధించారు. మహిళల ఆర్మ్స్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో అడ్డాకుల పోలీ్‌సస్టేషన్ కానిస్టేబుల్ రాధిక గోల్డ్‌మెడల్ సాధించింది. బ్యాడ్మింటన్ 55 ప్లస్ ఏజ్ గ్రూప్ సింగిల్స్, డబుల్స్‌లో టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్, బ్యాడ్మింటన్ 55 ప్లస్ డబుల్స్‌లో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ పురేందర్ సిల్వర్ పతకాలు, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఇమ్రాన్‌కు బాడీ బిల్డింగ్ 90 ప్లస్‌లో సిల్వర్, లాన్ టెన్ని్‌సలో కాంస్యం పతకాలు సాధించారు. ఏఆర్ పీసీ భిక్షం, ఏఆర్‌పీసీ నర్సింహరెడ్డి, ఏఆర్ పీసీ రఘునాయక్, పీసీ విష్ణువర్దన్‌రెడ్డిలు కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఎస్పీ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు.